నల్గొండలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం
నల్గొండ జిల్లా మతసామరస్యానికి మారుపేరుగా నిలుస్తోందని, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మసీదులో ముస్లిం మైనార్టీ సోదరులకు దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. పట్టణంలో పేద మైనార్టీ మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు...