పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కఠిన ఆదేశాలు

పదవ తరగతి పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సవ్యంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫాన్స్ పాఠశాల, నల్గొండ మండలం దోమలపల్లి జెడ్పిహెచ్ఎస్, మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం ఉండేలా చూడాలని, వేసవి తీవ్రత దృష్ట్యా కుండలలో...