నల్గొండలో 116 మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
మహిళలు పురుషులతో సమానంగా ఎదిగి ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ సంస్థలో కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టుమిషన్లు మరియు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని సూచించారు. పట్టుదలతో శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని తెలిపారు. నల్గొండలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణ సంస్థను రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సెట్విన్ ద్వారా...