కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన పెంపొందించుకొని చట్టాలను వినియోగించుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, లింగ సమానత్వం వంటి అంశాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి...