శ్రీ చైతన్య విద్యార్థినీలను అభినందించిన నల్లగొండ మేయర్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన నేషనల్ ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి గ్రాండ్ ప్రైజ్ మరియు మొదటి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినీలను అభినందించారు. విద్యార్థులు మంచి చదువుతో తమ భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకు కృషి చేస్తున్న చైతన్య విద్యాసంస్థల అధ్యాపకులు మరియు నిర్వాహకులను మేయర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లెపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఏజీఎం సుజాత, నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగరాజు, రాజేందర్, సాయి రెడ్డి, వాసవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.