రంజాన్ సందర్భంగా ప్రకాశం బజార్ మసీదులో ఇఫ్తార్ విందు

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం మరియు సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ముస్లింల గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్...