ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసిన ఆశన్నగారి జీవన్ రెడ్డి
తన జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శనివారం ఎర్రవెల్లిలో బి.ఆర్.ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సందర్భంగా పార్టీ కార్యకలాపాలు మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ అధినేతను కలుసుకుని ఆశీర్వాదం పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు.