నల్గొండలో మున్సిపల్ సిబ్బందిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు

నల్గొండ నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని VT కాలనీలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిపై అక్రమ వసూళ్లు, వివక్షత ఆరోపణలు వెలువడ్డాయి. రాజస్థాన్ టీ స్టాల్ సమీప ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెరకు వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నప్పటికీ, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ప్రకారం, చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది బహిరంగంగా డబ్బులు కోరుతున్నారని తెలిపారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి ప్రాంతాలను మాత్రమే శుభ్రం చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని సాధారణ ప్రజల ఇళ్ల ముందు లేదా బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించిన వారిని సిబ్బంది అసభ్య పదజాలంతో...