ఇండోనేషియాలో భారీ భూకంపం… రోడ్లు చీలిపోవడంతో భయాందోళన

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవిని 6.1 తీవ్రత గల భూకంపం కుదిపినట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధనా కేంద్రాలు వెల్లడించాయి. భూకంపం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చీలిపోవడం, భవనాలకు స్వల్ప నష్టం సంభవించడం జరిగింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.