డెహ్రాడూన్లో బస్సు లోయలో పడి బీభత్సం.. 5 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయని సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.