చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్ రామ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, బాధ్యతలను కల్పించిందని, ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా రాజ్యాంగ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరారు. ప్రత్యేకంగా పారిశుధ్యం, హరితహారం, మౌలిక సదుపాయాల...