పాలక వీడు మండలంలో జాన్ పహాడ్ దర్గాను దర్శించుకున్న మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

పాలక వీడు మండలం: పాలక వీడు మండలంలో ఉన్న ప్రసిద్ధ జాన్ పహాడ్ దర్గాను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దువా చేశారు. అనంతరం దర్గా కమిటీ సభ్యులతో మాట్లాడి దర్గాకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి అజారుద్దీన్ దర్గా సందర్శన సందర్భంగా స్థానిక నాయకులు, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి రాకతో దర్గా పరిసరాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.