నాంపల్లిలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతులు

హైదరాబాద్ | మీడియా వార్తలు | జనవరి 23: ప్రతి నిత్యం జర్నలిస్టులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భాషా–సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవన అనుభవాలను పంచుకుంటూ నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో తాను విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. జర్నలిజంతో ముడిపడిన అనేక అంశాలు, అనుభవాలను వివరించారు. తెలంగాణ మీడియా...