నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

ములుగు | సామాజిక వార్తలు: తేదీ 23/01/2026 (శుక్రవారం) నాడు తెలంగాణ నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్నం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో, తెలంగాణ నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ నూతన క్యాలెండర్‌ను ములుగు జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను అభినందించారు. నాయి బ్రాహ్మణులందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని, సమాజ అభివృద్ధికి జిల్లా పరిపాలన తరఫున తమ వంతు సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందాల సంపత్, నిల్పుగొండ సతీష్, ఓదెల నరసయ్య, వి. కృష్ణ, వేల్పుగొండ రఘువీర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.