జపాన్ మాజీ ప్రధాని హత్య: దుండగుడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్
టోక్యో | అంతర్జాతీయ వార్తలు: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన నిందితుడికి జపాన్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ఎన్నికల ప్రచార సభ సందర్భంగా అబేను కాల్చి చంపిన ఘటన జరిగి మూడు సంవత్సరాలన్నర తర్వాత ఈ తీర్పు వెలువడింది. 2022లో జరిగిన ఈ దారుణ ఘటన జపాన్ను తీవ్రంగా కుదిపేసింది. అత్యంత కఠిన భద్రతా వ్యవస్థ ఉన్న దేశంగా పేరున్న జపాన్లో, బహిరంగ సభలో మాజీ ప్రధాని హత్య జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిపై విచారణ పూర్తిచేసిన కోర్టు, అతడి నేరం అత్యంత ఘోరమైనదని పేర్కొంటూ జీవిత ఖైదు...