రేపటి భవిష్యత్తు బీసీలదే: ఈటల రాజేందర్

ఎల్‌బీ నగర్ / హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు, కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “రేపటి భవిష్యత్తు పూర్తిగా బీసీలదే” అని స్పష్టం చేశారు. సామాజిక ఉద్యమాలు ఒక్క తరంలోనే విజయం సాధించవని, కానీ బీసీ సంఘాలు ఎన్నో ఏళ్లుగా సాగించిన పోరాట ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. యాభై శాతం పైగా సర్పంచ్‌లు గెలుపొందడం బీసీల ఐక్యత, పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు. మన శ్రమ ఎప్పటికీ...