నల్లగొండ కార్పొరేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రికి కృతజ్ఞతలు
నల్లగొండ: ఈరోజు రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీఎన్జీవోస్ నాయకులు, ప్రాథమిక సభ్యులు మరియు ఉద్యోగస్తులు వీటి కాలనీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ టౌన్‌ను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చినందుకు గాను గౌరవ మంత్రివర్యులకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఎన్జీవోస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ హోదాతో ఉద్యోగులకు HRA పెంపు, CCA, హౌస్ లోన్ పరిమితి పెంపు వంటి ప్రయోజనాలు చేకూరుతాయని టీఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణకు మంత్రివర్యులను ఆహ్వానిస్తూ, కార్పొరేషన్‌గా మారిన సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలని,...