17న వార్డు కేటాయింపు డ్రా.. కలెక్టర్ సమక్షంలో నిర్వహణ
మున్సిపల్ సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు రేపు శనివారం, 17వ తేదీన జిల్లా కలెక్టరేట్లో మున్సిపల్ వార్డుల వారిగా డ్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సమక్షంలో జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియలో భాగంగా ఈ డ్రా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వార్డుల కేటాయింపు, రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో పాటు, ఎన్నికల ప్రక్రియకు ఇది కీలక దశగా భావిస్తున్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.