సంక్రాంతి రద్దీకి చెక్.. హైదరాబాద్ వాహనాలకు దారి మళ్లింపు
చిట్యాల / నల్లగొండ జిల్లా: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండుగ ముగించుకొని హైదరాబాద్ నగరానికి ఒకేసారి భారీగా వాహనాలు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, నేషనల్ హైవే–65 (విజయవాడ–హైదరాబాద్) పై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 🚦 ట్రాఫిక్ దారి మళ్లింపు వివరాలు 1️⃣...