జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం – అక్రమ అరెస్టులను ఖండించిన జీసీడబ్ల్యూజేఏ
హైదరాబాద్: ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనానికి సంబంధించి ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను ఎటువంటి విచారణ లేకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.ఎస్. సుభాష్ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జల వీరేష్ తెలిపారు. జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్లను బాధ్యులను చేస్తూ, సిట్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో వారి నివాసాల్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్టు చేయడం దారుణమని వారు విమర్శించారు. మీడియా సంస్థల్లో ప్రసారమయ్యే కథనాలకు ఆయా సంస్థల ఎడిటర్లు, యాజమాన్యం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని,...