కేంద్ర హెచ్చరికలపై X యాక్షన్.. వేలాది పోస్టులు డిలీట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నోటీసులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (మాజీ ట్విటర్) స్పందించింది. ప్రభుత్వ సూచనల మేరకు 3,500 అసభ్యకర పోస్టులను తొలగించడంతో పాటు 600 ఖాతాలను డిలీట్ చేసినట్లు X సంస్థ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, ద్వేషపూరితమైన కంటెంట్ పెరుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చట్టానికి విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు X చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ అవసరమని, ముఖ్యంగా ప్రజా శాంతి, మహిళల భద్రత, చిన్నారుల రక్షణ దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పనిసరిగా మారాయని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులోనూ నిబంధనలకు విరుద్ధంగా...