నల్లగొండ బ్రేకింగ్: డ్రైనేజీలో బీఆర్ఎస్ ఓట్లు లభ్యం కేసులో 12 మందిపై సస్పెన్షన్ వేటు!
నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీ కాల్వలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిక్షపతికి పోలైన బ్యాలెట్ ఓట్లు లభ్యమయ్యిన ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆర్వోను సస్పెండ్ చేయగా, తాజాగా ఎంపీడీవో జయలక్ష్మి, స్టేజ్–2 అధికారి విజయ్ కుమార్తో పాటు మొత్తం 12 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ⚖️ ఘటనపై రాజకీయ నేతల ఆగ్రహం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, కంచర్ల భూపాల్...