ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ — రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు

నల్లగొండ జిల్లా, చండూరు — నవంబర్ 7: చండూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గురువారం రాత్రి ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఒక రైతు నుండి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 🔍 ఏం జరిగింది? — కేసు వివరాలు గట్టుపల్ మండలం, తెరట్పల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్‌పై బాధితుడు సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు కోరాడు. దీనికి సంబంధించి వివరాలు ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా ట్రాప్ ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, హైదరాబాద్ బాలాపూర్‌లోని తన నివాసంలో చంద్రశేఖర్...