ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని గ్రామ పంచాయతీ — పేరూరులో ఎలక్షన్ బహిష్కరణ
గ్రామ పంచాయతీ ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్ కింద ఉంది. కానీ గ్రామంలో: ఎస్టీ మహిళ అభ్యర్థి ఒక్కరైనా లేకపోవడం, దాంతో పాటు ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు కూడా ఎస్టీ రిజర్వ్ కావడం, పరిస్థితిని క్లిష్టంగా మార్చింది. 🔸 పార్టీలు కూడా బహిష్కరణలో భాగం గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు, సంఘాలు ఒకే మాటపై ఏకమయ్యారు— “మా గ్రామానికి సహజ పరిస్థితులకు సరిపోయే రిజర్వేషన్ కావాలి… అందుకే ఎలక్షన్ బహిష్కరిస్తున్నాం.” దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పేరూరులో పూర్తిగా బహిష్కరణ అమలైంది. 🔸 ఎన్నికల చరిత్రలో అరుదైన సంఘటన గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానందున ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది...