తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 సిద్ధతలపై సీఎం సమీక్ష
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రೋల్ సెంటర్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేంనరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. సమ్మిట్‌కు దేశ–విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహ్వానితులకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి అంశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. సమ్మిట్‌కు సంబంధించి ఇప్పటికే దాదాపు 2600 మంది...