సౌదీ రోడ్డు ప్రమాదంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు విదేశాంగ విభాగంతో మాట్లాడినట్లు తెలిపారు. 📞 రియాద్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌తో ఒవైసీ సంప్రదింపు ఓవైసీ మాట్లాడుతూ— తానే స్వయంగా రియాద్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబూ జార్జ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన అధికారిక సమాచారం స్థానిక అధికారుల నుంచి సేకరిస్తున్నట్లు అబూ జార్జ్ తెలిపారని చెప్పారు. గాయపడ్డవారి వివరాలు, మృతుల జాబితా, వారి కుటుంబాలకు సాయం వంటి...