రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ, కానిస్టేబుల్!

ములుగు, నవంబర్ 7, 2025: ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమ కబ్జా కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ విజయ్‌కుమార్ మరియు కానిస్టేబుల్ రాజులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 💰 లంచం డిమాండ్ వివరాలు ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు అక్రమంగా కబ్జా చేసిన ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి పక్షాన తీర్పు ఇచ్చి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల కాపీని బాధితులు ఎస్ఐ విజయ్‌కుమార్‌కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరగా, అయన “ఇంటి హక్కు పత్రాలు అప్పగించాలంటే రూ.1 లక్ష లంచం...