'మా పిల్లలకు ఊపిరి ఇవ్వండి': ఇండియా గేట్ వద్ద దిల్లీ పౌరుల నిరసన, పలువురు నిర్బంధం

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, దానిపై తక్షణ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం (నవంబర్ 9, 2025) ఇండియా గేట్ సమీపంలో స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మాన్​సింగ్ రోడ్డులో జరిగిన ఈ ఆందోళనలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సహా పాల్గొన్నారు. "పొగమంచు నుంచి ఆజాది!" మరియు "శ్వాస తీసుకోవడం మమ్మల్ని చంపేస్తోంది" వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నిరసన సమయంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 370 మార్కును దాటి, 'చాలా నాసిరకం' (Very Poor) కేటగిరీలో నమోదైంది. తల్లిదండ్రుల ఆవేదన:...