మిస్ యూనివర్స్ 2025లో కలకలం – ఫాతిమా బోష్‌పై నిర్వాహకుడి ప్రవర్తనకు వ్యతిరేకంగా వాక్‌అవుట్!

బ్యాంకాక్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 ఈవెంట్‌లో వివాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన పేజెంట్ నిర్వాహకుడు నవాత్ ఇట్సరాగ్రిసిల్ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతున్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌ను గద్దించి “మాట్లాడొద్దు” అంటూ అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో నవాత్, ఫాతిమా బోష్‌పై గట్టిగా మాట్లాడుతుండగా, అక్కడి కొందరు ప్రతినిధులు ఆయనకు ఎదురు తిరిగి స్పందించినట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనతో వేదికపై కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తదుపరి క్షణాల్లో, ఫాతిమా బోష్‌కి సంఘీభావంగా మిస్ ఆర్మేనియా, మిస్ కెనడా, మిస్ పాలస్తీనా, మిస్ బెలీజ్, మిస్ స్పెయిన్ తదితర దేశాల ప్రతినిధులు వేదికను వదిలి వెళ్ళారు....