ఉప్పాడ ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ హామీ – 100 రోజుల్లో పరిష్కారం సాధ్యమా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని స్పందించారు. సముద్ర కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, తీర కోత, జీవనాధారమైన మత్స్య వృత్తి నష్టపోవడం వంటి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ సమస్యలను పరిష్కరించేందుకు 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. దీనిలో భాగంగా పరిశ్రమల వ్యర్థాల విడుదల, సముద్ర కాలుష్యంపై సమగ్ర ఆడిట్ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. తీర రక్షణ, మత్స్యకారుల పునరావాసం, పరిహారం చెల్లింపులు వంటి అంశాలపై త్వరిత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక తీర రక్షణ...