కార్డ్ లేకుండా ATM నుంచి నగదు విత్‌డ్రా – UPI ఆధారిత కొత్త సౌకర్యం

ఇప్పుడు మీరు కార్డ్ లేకుండా ATM నుంచి నగదు విత్‌డ్రా చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ సౌకర్యం ద్వారా, మీరు UPI యాప్ ఉపయోగించి ATM లో డెబిట్/క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా నగదు తీసుకోవచ్చు. ఈ విధానం ఇలా ఉంటుంది: ATM మెనులో “UPI ద్వారా నగదు విత్‌డ్రా” ఆప్షన్ ఎంచుకోవాలి. అవసరమైన మొత్తాన్ని నమోదు చేస్తే ATM స్క్రీన్ మీద డైనమిక్ QR కోడ్ జనరేట్ అవుతుంది. మీరు మీ UPI యాప్ ద్వారా ఆ QR కోడ్ స్కాన్ చేసి, UPI PIN ద్వారా ఆథరైజ్ చేస్తే ATM నగదు విడుదల చేస్తుంది. ఒక్క ట్రాన్సాక్షన్‌కు ₹10,000 వరకు నగదు తీసుకోవచ్చు....