ఆర్టీసీ బస్‌ రిజర్వేషన్ ఇప్పుడు Google Maps‌లోనే

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TSRTC) త్వరలో Google Maps‌లోనే బస్సు టికెట్ల రిజర్వేషన్ సదుపాయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త సౌకర్యం ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లే ఆర్టీసీ బస్సుల సమయాలు, రూట్లు మాత్రమే కాకుండా టికెట్‌ రిజర్వేషన్‌ మరియు చెల్లింపులు కూడా నేరుగా Google Maps‌లో చేసుకోగలరు. ఈ సదుపాయంతో ప్రయాణికులు ఇకపై బస్టాండ్‌లకు వెళ్లి కౌంటర్లలో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. Google Maps‌ యాప్‌లో “ఎక్కడి నుండి ఎక్కడికి” అనే వివరాలు ఇవ్వగానే, అందుబాటులో ఉన్న బస్సులు, సమయాలు, చార్జీలు, సీట్లు వంటి సమాచారం చూపబడుతుంది. ఆపై నేరుగా బుకింగ్‌ చేసి ఆన్‌లైన్‌ పేమెంట్‌‌ ద్వారా...