రియల్ ఎస్టేట్ బజార్ పుంజుకుంది — అమ్మకాల వృద్ధితో మార్కెట్ కదిలింది!

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ మళ్లీ బూమ్‌ దిశగా సాగుతోంది. 2025 సంవత్సరంలోని జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో నగరంలో గృహ అమ్మకాలు 52 శాతం పెరిగినట్టు తాజా రియల్ ఎస్టేట్‌ రిపోర్టులు వెల్లడించాయి. ఈ మూడు నెలల వ్యవధిలో హైదరాబాద్‌లో సుమారు 20 వేలకుపైగా హౌసింగ్‌ యూనిట్లు అమ్ముడయ్యాయి. గడచిన ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. రియల్ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, మిడిల్-క్లాస్‌ మరియు ఐటీ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్‌ వస్తోందని డెవలపర్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో మాత్రమే సుమారు 6,600 హోమ్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి మొత్తం విలువ సుమారు ₹4,800 కోట్లకు చేరింది. ఇది గత...