టీ20 సిరీస్‌ మూడో మ్యాచ్‌: ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం — సుందర్‌ మెరుపులు, సిరీస్‌ 1–1 సమం

హోబర్ట్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెల్లెరివ్‌ ఓవల్‌లో శనివారం జరిగిన ఈ పోరులో సమష్టి ప్రదర్శనతో 187 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.3 ఓవర్లలో ఛేదించింది. వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (29), అభిషేక్‌ శర్మ (25), సూర్యకుమార్‌ యాదవ్‌ (24), జితేశ్‌ శర్మ (22 నాటౌట్‌) కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా తరఫున నాథన్‌ ఎలిస్‌ 3 వికెట్లు తీశాడు. స్టాయినిస్‌, క్సేవియర్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇంతకుముందు టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుని 20 ఓవర్లలో...