అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ – రొక్కం భాస్కర్‌రెడ్డి సహకారం
మారిగూడ మండలంలోని అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజున రొక్కం భాస్కర్‌రెడ్డి సహకారంతో, విక్టరీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడీ కార్డ్, క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ — “ప్రైవేట్ పాఠశాలలు అవసరం లేదు, ప్రభుత్వ పాఠశాలలే మనకు గర్వకారణం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయం” అని అన్నారు. అలాగే విద్యా అభివృద్ధిలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య, ముద్దం శ్రీధర్, మేఘవత్ చందు నాయక్, వెంకటేశ్, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ⚡ ప్రధానాంశాలు అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో...