నల్లగొండ‌లో షాక్‌: మార్కెట్లో పల్లీగా వచ్చినది రిఫైన్డ్‌ ఆయిల్‌?  

నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పరిధిలో ఒక ప్రైవేట్‌ ఆయిల్‌ కంపెనీపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో, అధికారులు రిఫైన్డ్‌ ఆయిల్‌ను పల్లీ నూనెగా లేబుల్‌ మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు బయటపెట్టారు. తనిఖీల్లో అధికారులు సుమారు 1,600 లీటర్ల నూనె, అలాగే 4,800 కిలోల ప్యాకింగ్‌ ఫిల్మ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను ల్యాబ్‌ పరీక్షలకు పంపించారు. సంస్థ యాజమాన్యం మొదట అధికారులకు సహకరించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు పూర్తయ్యాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ప్రకారం, ఈ నూనెను తక్కువ ధరకు రిఫైన్డ్‌ చేసి, పల్లీ నూనె అని ప్రజలకు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు మోసపోతున్నారని హెచ్చరికలు...