తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు – వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర.. సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (SIT) అధికారులు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అరెస్ట్ చేశారు. విచారణలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు SIT గుర్తించింది. రిమాండ్‌ రిపోర్టులో కూడా కుట్ర కోణాలను అధికారులు ప్రస్తావించారు. చిన్న అప్పన్న అరెస్టుతో కేసు మరింత ఆసక్తికర దశకు చేరుకుంది. 🔍 కల్తీ నెయ్యి సరఫరా వెనుక కుట్ర...