పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో పాలేరు రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత

కూసుమంచి: పరివాహక ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో పాలేరు రిజర్వాయర్ నిండిపోయింది. నీటి మట్టం 22.5 అడుగులకు చేరుకోవడంతో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం 3,078 క్యూసెక్కుల నీటిని ఫాలింగ్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పరిసర తక్కువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.