ముధోల్ & రాంపూర్ హౌండ్స్ – ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ప్రదర్శనకు సిద్ధం.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) దేశీయ జాతుల కుక్కలతో కూడిన ప్రత్యేక బృందాన్ని గుజరాత్లో జరిగే ‘రాష్ట్ర ఏకతా దివస్’ పరేడ్లో ప్రదర్శించబోతోంది. ఈ బృందంలో భారతీయ జాతులైన ముధోల్ హౌండ్ (Mudhol Hound) మరియు రాంపూర్ హౌండ్ (Rampur Hound) కుక్కలు ఉంటాయి. ఇవి పూర్తిగా బీఎస్ఎఫ్ శిక్షణ పొందిన కుక్కలు. ఈ కుక్కలు సరిహద్దు భద్రతా కార్యకలాపాలు, ఉగ్రవాద నిరోధక చర్యలు, అలాగే నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో తమ ప్రతిభను ఇప్పటికే నిరూపించాయి. ఈ ప్రదర్శన ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ (Atmanirbhar Bharat) లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యం. ఈ కార్యక్రమం అక్టోబర్ 31, 2025న సర్దార్ వల్లభభాయి...