క్రికెట్ meets సినిమా: చిరంజీవి, తిలక్ వర్మ సత్కరణ క్షణం

ఈరోజు చిరంజీవి, తన తాజా సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” సెట్స్‌లో భారత క్రికెటర్ తిలక్ వర్మని ప్రత్యేకంగా ఆహ్వానించి, అతని ఆసియా కప్ విజయాన్ని ప్రశంసించారు. చిరు అతనికి షాల్‌, ఒక ఫ్రేమ్‌ ఫోటో ఇస్తూ “కఠిన శ్రమ, అస్థిర ఉద్వేగం కాకుండా ప్రశాంతంగా పని చేయడం విజయానికి మార్గం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ నయనతార, మరియు ఇతర చిత్రబృంద సభ్యులు కూడా పాల్గొన్నారు.