నల్లగొండలో బీసీ సంఘాల సమన్వయ సమావేశం – 18న తెలంగాణ బంద్‌కు పిలుపు
నల్లగొండ: రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు అక్టోబర్ 18, 2025న జరగనున్న తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయడానికి నల్లగొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్ర హరి రామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ జీవో–9ను అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని తెలిపారు. జీవో అమలు పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు. బంద్‌ను విజయవంతం చేయడానికి జిల్లాలోని...