నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండలో రైతుల కోసం బీజేపీ ఆందోళన

నల్గొండ: జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పంట కొనుగోలు ఆలస్యం, కనీస మద్దతు ధర లోపం, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, ఎరువు-విత్తనాల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ధరణి అనంతరం, జిల్లా కలెక్టరుకు మెమోరాండం సమర్పించి, రైతుల సమస్యలపై అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం‌ను కోరారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి పాల్గొని రైతుల తరఫున తమ సంఘీభావం ప్రకటించారు. స్పందన రాకపోతే ఆందోళనలను...