ఎస్సారెస్పీ ఫేజ్–2 ప్రాజెక్టుకు “రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి” పేరు
24 గంటల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం, దామోదర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎస్సారెస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ వ్యాధిని తరిమికొట్టడంలో దామోదర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆ సేవలను స్మరించుకుంటూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్–2ను ఇకపై **“రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి...