అధిక వడ్డీ ఆశతో 50 కోట్ల రూపాయల మోసం – నిందితుడు అరెస్ట్

నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు రామవత్ బాలాజీ నాయక్ను అరెస్ట్ చేశారు. ఇతను, పలుగు తండా, వడ్డి పట్ల గ్రామం, పి. ఏ. పల్లి మండల్ నివాసి, జవహర్ లాల్ కుమారుడు, వయసు 26, రియల్ ఎస్టేట్ వ్యాపారి, సుమారు 50 కోట్ల రూపాయల మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలాజీ నాయక్ తన ఏజెంట్ల ద్వారా అమాయకుల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడు. 2019లో డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత 2020లో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం కోసం ₹5 లక్షలు 2% వడ్డీకి తీసుకుని నష్టపోయాడు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ₹6–10 రేట్ల వడ్డీ ఇచ్చి...