రైల్వే సౌకర్యం: టికెట్ తేదీ మార్పుకు ఆన్‌లైన్‌ ఆప్షన్‌

భారత రైల్వే ప్రయాణికులకు కొత్త సౌకర్యం అందించడానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి నుండి, IRCTC ద్వారా బుక్ చేసిన కన్ఫర్మ్‌డ్‌ టికెట్లలో ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో మార్చుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రయాణ తేదీ మార్చాలంటే టికెట్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా బుక్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త విధానం ప్రకారం టికెట్‌ను రద్దు చేయకుండా అదే టికెట్‌లో తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం కోసం ఏ రద్దు చార్జీ ఉండదు, కానీ కొత్త తేదీకి టికెట్ రేటు ఎక్కువైతే, ప్రయాణికుడు ఆ తేడా మొత్తాన్ని చెల్లించాలి. అయితే కొత్త తేదీలో సీట్లు లభ్యతపై ఆధారపడి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది....