తమిళనాడు ఫ్యాక్టరీలో 364 ఉల్లంఘనలు – లైసెన్స్ రద్దు, యజమాని అరెస్ట్

భారతదేశంలో మరోసారి ఔషధ పరిశ్రమలో నిర్లక్ష్యం పెద్ద ప్రాణనష్టం కలిగించింది. కోల్డ్రిఫ్ (Coldrif) అనే దగ్గు సిరప్‌లో విషపదార్థమైన డైఎథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol) అధిక మోతాదులో కలిసినట్లు ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయి. ఈ సిరప్ సేవించిన చిన్నారుల్లో పలువురి మరణంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 433 కోల్డ్రిఫ్ సిరప్ బాటిళ్లు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 222 బాటిళ్లు విక్రయించబడ్డాయి, వాటిని వెతికి స్వాధీనం చేసుకునే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) తమిళనాడులోని చిన్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తోంది. దాదాపు 14 సంవత్సరాలుగా ఈ ప్లాంట్‌లో...