ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న రుణభారం – చైనాకు $22 బిలియన్ చెల్లింపులు చేయాల్సిన 75 దేశాలు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారీ రుణభారం కింద ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మరియు వరల్డ్ బ్యాంక్ నివేదికల ప్రకారం, 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సమస్యల్లో ఒకటిగా ప్రభుత్వ అప్పు పెరుగుదల నిలిచింది. ఘనా ఇటీవల తన 25 దేశాల రుణదాతలతో 2.8 బిలియన్ అమెరికన్ డాలర్ల అప్పు రీషెడ్యూలింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, అమెరికా వంటి దేశాలు ఈ ఒప్పందంలో భాగమయ్యాయి. 2022లో డిఫాల్ట్ అయిన తర్వాత ఇది ఘనాకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం, చైనాకి అత్యధిక రుణాలు ఉన్న 75 పేద దేశాలు 2025లో చైనాకు 22 బిలియన్ డాలర్లు...