ప్లాంట్ ఫుడ్స్‌పై మాంసం పేర్లు వాడకూడదు – యూరోపియన్ యూనియన్‌లో కొత్త తీర్మానం

యూరోపియన్ పార్లమెంట్ ఇటీవల ప్లాంట్‌ బేస్డ్ ఆహార ఉత్పత్తులపై మాంసం పేర్లను వాడటాన్ని నిషేధించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై “బర్గర్”, “సాసేజ్”, “స్టేక్”, “ఎస్కలోప్” వంటి మాంసాహార పదాలను మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తుల పేర్లలో ఉపయోగించకూడదు. ఈ తీర్మానానికి 355 మంది సభ్యులు మద్దతు తెలపగా, 247 మంది వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్‌కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు సెలీన్ ఇమార్ట్ నేతృత్వం వహించారు. ఆమె ప్రకారం, ఈ పదాలు జంతువుల నుండి వచ్చే ఉత్పత్తులకు మాత్రమే సంబంధించినవని, వాటిని వెజిటేరియన్ లేదా ప్లాంట్‌ బేస్డ్ ఆహారాలకు ఉపయోగించడం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ...