🕌 లతీఫుల్లా షాఖాద్రీ ఉరుసు వేడుకలు 9వ తేదీ నుంచి ప్రారంభం

నల్గొండ కల్చరల్, అక్టోబర్ 5 : జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా షాఖాద్రీ దర్గా ఉరుసు వేడుకలు ఈ నెల 9వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఉరుసు వేడుకలు అధికారికంగా మూడు రోజుల పాటు జరుగుతాయి. అయితే ఉత్సవాలు మొత్తం నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. గుట్టమెట్ల ప్రాంతంలో ఇప్పటికే వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు అయ్యాయి. దర్గా పరిసర ప్రాంతం అంతా విద్యుత్ దీపాలతో, రంగుల అలంకరణలతో ఆధ్యాత్మిక, ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు...