త్రిపురారంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు
నల్గొండ జిల్లా: త్రిపురారంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులం మరియు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా మినీ గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్, సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడుతూ వారి పేర్లు, వివరాలు, ఇష్టమైన సబ్జెక్టులు తదితర అంశాలను తెలుసుకున్నారు. విద్యార్థులను బాగా చదవాలని ప్రోత్సహిస్తూ, వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు తరగతి గదులలోనే రాత్రివేళలు నిద్రిస్తున్నారని తెలిసిన కలెక్టర్, తక్షణమే 100 పరుపులను నల్గొండ నుండి పంపిస్తానని ప్రకటించారు. మినీ గురుకులంలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను ఆమె తనిఖీ చేసి, వేగంగా...